Tuesday, June 2, 2015

Salaries to Local bodies in Andhrapradesh,స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు



స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు

 జడ్పీ ఛైర్మన్‌కు రూ.40 వేలు .సర్పంచ్‌కు రూ.3 వేలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలోని 12,918 మంది సర్పంచులు, 659 మంది జడ్పీటీసీ సభ్యులు, 659 మంది ఎంపీపీలు, 10,148 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక సంఘాల ఛైర్మన్లు, కౌన్సిలర్లకు వేతనాలు పెరగనున్నాయి. పంచాయతీరాజ్‌ సంస్థల ప్రతినిధులకు వేతనాల పెంపు వల్ల ప్రభుత్వంపై రూ.93 కోట్ల అదనపు భారం పడనుంది. పురపాలక సంస్థల ప్రతినిధులనూ కలిపితే ఈ భారం మొత్తం సుమారు రూ.125 కోట్లు ఉంటుందని అంచనా. వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు బాబూరాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్యలు సోమవారమిక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేతనాల పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రెండు, మూడురోజుల్లో ప్రకటించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెరిగిన వేతనాలు ఇలా ఉండబోతున్నాయి.
  •  

  • ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

Friday, May 22, 2015

2015 Sirisha(Srikakulam dist TDP president) , 2015 శిరీష -తెదేపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు




  • Sirisha , శిరీష--May 2015





తెదేపా జిల్లా అధ్యక్ష పీఠం పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె శిరీషకే దక్కింది. ఈమె నియామక వివరాలు గురువారం హైదరాబాద్‌లో పార్టీ అధిష్టానం వెల్లడించింది.

శిరీష కుటుంబ నేపథ్యం
* పేరు: శిరీష
* స్వస్థలం: సోంపేట
* నియోజకవర్గం: పలాస
* పుట్టిన తేది: 16-5-1974
* విద్యార్హత: ఎంబీకే (మార్కెటింగ్‌)
* కుటుంబ రాజకీయ నేపథ్యం: తాత స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి, సర్థార్‌ గౌతులచ్చన్న. తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ. ఈయన మాజీ మంత్రి. ప్రస్తుత పలాస ఎమ్మెల్యే. తల్లి గౌతు

విజయలక్ష్మి. సోంపేట మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు.

* కుటుంబం: భర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి. ఈయన పారిశ్రామిక వేత్త. సంఘ సేవకులు. కుమారుడు, కుమార్తె ఉన్నారు.

* రాజకీయ అనుభవం: 2004 ఎన్నికల తరువాత పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో పూర్తిస్థాయి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆమె

తండ్రి విజయానికి కృషి చేశారు. 2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పలాస నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ పథకాల ప్రచారంలో

పాల్గొంటున్నారు. 2014లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి పలాసను జిల్లాలో రెండో స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారు. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ(గ్లో) అధ్యక్షరాలిగా

పనిచేస్తున్నారు. గ్రామాల్లో నీటిశుద్ధి యంత్రాల ఏర్పాటు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
* వ్యాపార నేపథ్యం: శిరీషా పెట్రోలియం, సర్ధార్‌ ప్రాజెక్టు ప్రై.లిమిటెడ్‌(నిర్మాణరంగం).
* ఇప్పటి వరకూ చేపట్టిన రాజకీయ పదవులు: ఏమీ లేవు.

  • ==============================

Visit my website - > Dr.Seshagirirao-MBBS. 

Saturday, March 7, 2015

Srikakulam Dist. Women political Representatives,శ్రీకాకుళం జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు


శ్రీకాకుళం జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు -- మునుపటి కన్నా చాలా ఎక్కువే. ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భముగా వీరి సంఖ్య ఇలా ఉన్నది.


  •  
 
  • ===============================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.

Tuesday, November 25, 2014

Defeated even though party changed,గోడ దూకినా... తప్పని ఓటమి.












గోడ దూకినా... తప్పని ఓటమి! -- న్యూస్‌టుడే - రాజాం, టెక్కలి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎంతో మంది నాయకుల రాజకీయ జీవితాలను తలకిందులు చేశాయి. పార్టీలు మారి పోటీ పడ్డ నేతల్లో అత్యధికులకు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అటు వైకాపాలోనూ గెలిచిన అభ్యర్థుల్లో సంతోషమే లేదు. పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నది వారి బాధ.
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారటంతో చాలామంది పార్టీలు మారి టికెట్లు దక్కించుకున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారు ఓటమిపాలయ్యారు. మరో అయిదేళ్ల వరకు రాజకీయ భవితవ్యం ఏమిటో తెలియక సతమతమవుతున్నారు. కేడర్‌ను ఎలా నిలుపుకోవాలో అంతుబట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. వైకాపా నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో.. వ్యక్తిగతంగానూ విజయం సాధించక, రాష్ట్రంలోనూ అధికారం లేకపోవడంతో అయిదేళ్లూ ఎలా నెట్టుకు రావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
* ఇచ్ఛాపురం నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన నర్తు రామారావు ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈసారి పార్టీ మారినా కలిసిరాలేదు. పైగా తెదేపా చేతిలో భారీ తేడాతో ఓడిపోవటం ఆయన వర్గీయులకు షాకిచ్చింది. ఇప్పుడు రాజకీయంగా నెట్టుకు రావడం కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ లల్లూ కొంతవరకు ఓట్లను రాబట్టగలిగినా.. భవిష్యత్తు ఏమిటన్నది ఆయన వర్గీయుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది.
* పలాస నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన వజ్జ బాబూరావు కాంగ్రెస్‌ నుంచి వైకాపాలోకి మారి టికెట్‌ తెచ్చుకున్నారు. చివరకు ఓటమి పాలయ్యారు. పలాస పురపాలకసంఘం సైతం చేజారిపోయింది. దీంతో క్యాడర్‌ మొత్తం అయోమయంలో ఉంది. 2009 ఎన్నికల్లో ప్రరాపా తరఫున పోటీ చేసిన వంక నాగేశ్వరరావు ఈసారి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
* టెక్కలి నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ గత ఎన్నికల్లో ప్రరాపా తరఫున పోటీ చేశారు. అచ్చెన్నాయుడు రాజకీయ వ్యూహాల ముందు శ్రీనివాస్‌ నిలవలేక పోయారు. పార్టీ మారి టికెట్‌ దక్కించుకున్నా.. ఫలితం లేకపోయింది. రాజకీయ మనుగడపై ఆయన అనుచరుల్లో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్‌రావు టెక్కలి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేక 1,849 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
* ఆమదాలవలస నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన తమ్మినేని సీతారాందీ ఇదే పరిస్థితి. తెదేపాలో సీనియర్‌ నేతగా, మాజీ మంత్రిగా తిరుగులేని గుర్తింపు పొందిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తిరిగి తెదేపా గూటికి చేరినా.. అంతలోనే మళ్లీ వైకాపాలోకి వెళ్లిపోయారు. బరిలోకి దిగినా తెదేపా అభ్యర్థి కూన రవికుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినట్లు కనబడినా.. సార్వత్రిక ఎన్నికల్లో సీతారాం చేతులెత్తేశారు.
* శ్రీకాకుళం నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన వైకాపాలో చేరిన తరువాత రాజకీయ భవితవ్యం పూర్తిగా మారిపోయింది. మొదటిసారి పోటీకి దిగిన మహిళ గుండ లక్ష్మీదేవి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఈయన అనుచరుల్లో చాలామంది వేరే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు తెదేపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
* నరసన్నపేట నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మాన కృష్ణదాసు మొదట్లో కాంగ్రెస్‌ వాదే. వైపాకాలోకి వచ్చాక జిల్లా కన్వీనరుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నికలో గెలిచిన ఆయన సార్వత్రిక ఎన్నికలొచ్చేసరికి మెజారిటీని నిలుపుకోలేకపోయారు.
* ఎచ్చెర్లలో వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే. చివరికి తెదేపా అభ్యర్థి కిమిడి కళావెంకటరావు చేతిలో ఓటమి తప్పలేదు. కళావెంకటరావు ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రరాపా అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తాజాగా తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు.
* పాతపట్నం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగిన శత్రుచర్ల విజయరామరాజు అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. చివరిలో పార్టీ మారినా.. గట్టిపోటీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన కలమట వెంకటరమణ ఈసారి వైకాపా తరఫున పోటీ చేశారు. 2009లో ప్రరాపా తరఫున పోటీ చేసిన పాలవలస కరుణాకర్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి కేవలం 1,506 ఓట్లనే తెచ్చుకోగలిగారు.
* పాలకొండ నుంచి వైకాపా తరఫున విజయం సాధించిన వి.కళావతి 2009లో ప్రరాపా అభ్యర్థిగా ఓడిపోయారు.
* రాజాం నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచిన కంబాల జోగులు 2009 ఎన్నికల్లో ప్రరాపా అభ్యర్థిగా ఓడిపోయారు. ఈసారి అదృశ్య శక్తుల సహకారంతో విజయ తీరాలకు చేరుకోలిగారు.
ఆర్థికంగా ఇబ్బందే
ఓటమి పాలైన చాలా మంది అభ్యర్థులు ఆర్థికంగానూ చితికిపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కోట్ల కట్టలను మంచి నీళ్లలా వెదజల్లారు. పార్టీ నిధి అందించినా.. సొంత డబ్బులు చాలా వరకు ఖర్చు చేసినట్లు ఓటమిపాలైన పలువురు అభ్యర్థులు 'న్యూస్‌టుడే'తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పార్టీ ఖర్చు చేస్తోందని మరో పార్టీ.. ఇలా అభ్యర్థులను సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే బ్లాక్‌మెయిల్‌ చేసి అధికంగా ఖర్చు చేయించారన్నది వీరి ఆక్రోశం.


  • ======================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

Tuesday, July 15, 2014

Chairmen and Vice.chairmen in Municipalities Srikakulam dist., శ్రీకాకుళం జిల్లాలో మునిసిపాలిటీ అధ్యక్ష-ఉపాధ్యక్ష ఎన్నికలు




అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు  ఆమదాలవలస ,పలాస, పాలకొండల్లో తెదేపా ఏకగ్రీవం, ఇచ్ఛాపురం- వైకాపా. ఎన్నికలు జరిగిన నాలుగు పురపాలక సంఘాల్లో పలాస, ఆమదాలవలస, పాలకొండల్లో తెదేపా అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆమదాలవలస మినహా ఉపాధ్యక్ష పదవులు ఆ పార్టీకే దక్కాయి. ఆమదాలవలలో తెదేపాకు కాంగ్రెస్‌ మద్దతిచ్చి ఉపాధ్యక్ష పదవి దక్కించుకుంది. వైకాపా ఇచ్ఛాపురంతో సరిపెట్టుకుంది--అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దక్కించుకోలిగింది. పాలకొండ, పలాసల్లో అధ్యక్ష, ఉపాధ్య ఎన్నికలు తెదేపాకు ఏకగ్రీవమయ్యాయి. పాలకొండలో వైకాపా విప్‌ను ఫ్యాక్సులో పంపడంతో పరిగణనలోకి తీసుకోలేదు.

'పుర' సారథులు :
  • ----------------------------------------------------
పాలకొండ:
  • పల్లా విజయనిర్మల (అధ్యక్షురాలు, తెదేపా),
  • సిరిపురపు చూడామణి (ఉపాధ్యక్షులు, తెదేపా),
-
  • --------------------------------------------------------
ఆమదాలవలస:
  • తమ్మినేని గీత (అధ్యక్షురాలు, తెదేపా),
  • కూన వెంకటరాజ్యలక్ష్మి (ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్‌),
-

-------------------------------------------------------
పలాస:
  • కోత పూర్ణచంద్రరావు (అధ్యక్షుడు, తెదేపా),
  • జి.సూర్యనారాయణ (ఉపాధ్యక్షుడు, తెదేపా),
-
  • -------------------------------------------------------------
ఇచ్ఛాపురం:
  • పిలక రాజలక్ష్మి (అధ్యక్షురాలు, వైకాపా),
  • కాళ్ల శకుంతుల (ఉపాధ్యక్షురాలు, వైకాపా),



  • =======================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

Monday, July 14, 2014

Srikakulam Z.P.chairperson-vice chairperson elections 2014, శ్రీకాకుళం జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు2014


  •  
 శ్రీకాకుళం జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు ఏకపక్షంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 22 తెదేపా, 16 స్థానాలు వైకాపా సొంతం చేసుకున్నాయి. తెదేపా అధిష్ఠానం ఎన్నికలకు ముందే అధ్యక్ష స్థానానికి బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి పేరు ప్రకటించింది.
  • అధ్యక్షురాలిగా ధనలక్ష్మి
  • ఉపాధ్యక్షురాలు: జ్యోతి
  • కో-ఆప్షన్‌ సభ్యులు: సదానందరౌళో, ముఖలింగం--అంతా ఏకగ్రీవమే

-
జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెదేపా సొంతం చేసుకుంది.జడ్పీ అధ్యక్షురాలిగా ఎచ్చెర్ల జడ్పీటీసీ సభ్యురాలు, జిల్లా తెదేపా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జి) భార్య చౌదరి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా వీరఘట్టం జడ్పీటీసీ సభ్యురాలు ఖండాపు జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా మైనార్టీ వర్గం తరఫున కవిటికి చెందిన సదానందరౌళో, సీతంపేట కన్నెధార ఉద్యమ నాయకుడు, గిరిజన వర్గానికి చెందిన సవర తోట ముఖలింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. తెదేపా తరఫున జడ్పీ అధ్యక్షురాలిగా చౌదరి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా ఖండాపు జ్యోతిల పేర్లతో కూడిన పార్టీ బిఫారాలను ఉదయం 9.30 గంటలకు తెదేపా శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్‌కు అందించారు. కో-ఆప్షన్‌ సభ్యులకు సంబంధించిన తెదేపా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌ల సమక్షంలో ఉదయం పది గంటల సమయంలో సదానందరౌళో, సవర తోటముఖలింగంలు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. తరువాత వైకాపా సభ్యులు 16 మంది సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కో-ఆప్షన్‌ సభ్యుల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. సదానందరౌళో, సవర తోటముఖలింగంలకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా వారు ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువపత్రాలు అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులిగా ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా జ్యోతిలు మాత్రమే నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ధనలక్ష్మి అభ్యర్థిత్వాన్ని నరసన్నపేటకు తెదేపా సభ్యురాలు శకుంతల ప్రతిపాదించారు. ఇచ్ఛాపురం, వంగరకు చెందిన తెదేపా సభ్యులు అంబటి లింగరాజు, బొత్స వాసుదేవరావునాయుడులు బలపరిచారు. ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు జ్యోతిని సంతకవిటి తెదేపా జడ్పీటీసీ సభ్యురాలు కొల్ల జ్యోతిర్మయి ప్రతిపాదించగా, కవిటి, లావేరు తెదేపా సభ్యులు బెందాళం రమేష్‌, పిన్నింటి శ్రీదేవిలు బలపరిచారు. జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వీరికి ఎన్నిక ధ్రువపత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు.

Srikakulam dist. Z.P. members 2014 : 


-


-

















  • Z.P.Chair-persons in Andhrapradesh(seemandhra):


  • ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.